Home  »  TV News  »  Brahmamudi : రాజు భయంతో ఇందూ చంకెక్కిన వైనం.. ఐశ్వర్య నిజం బయటపెట్టనుందా

Updated : Jul 31, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1098 లో...రాజు కోసం ఇందు కాఫీ పట్టుకొని వెళ్తుంది. మా బావ ఎప్పుడు నా దారికి వస్తాడోనని ఇందు అనుకుంటుంది. అప్పుడే గోడపై బల్లి కన్పిస్తుంది. ఏ బల్లి మా ఇద్దరిని కలపడానికి ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అని ఇందు అనగానే బల్లి ఏదో సౌండ్ చేస్తుంది. నాకూ అర్థం కాదు నీ బాష అని ఇందు అనుకుంటుంది. రాజు అది చూసి ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నావని అడుగుతాడు. ఏం లేదు బావ అని ఇందు అంటుంటే.. అప్పుడే రాజు దగ్గరికి బల్లి వస్తుంది.

దాన్ని చూసి రాజు భయపడి ఇందు చంక ఎక్కుతాడు. నేను అంటే ఎంత ఇష్టం లేకుంటే ఇలా చంకన ఎక్కుతావ్ బావ అని ఇందు అనగానే అంతలేదని రాజు అంటాడు. ఆ తర్వాత ఐశ్వర్య పార్టీకి వెళ్తుంటే ఎక్కడికి అని ఇందు అడుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నానో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదని ఐశ్వర్య అనగానే ఎవరు ఎక్కడికి వెళ్లినా నా భార్యకి చెప్పి వెళ్ళాలని రాజు అంటాడు. ఏంటి ఆంటీ మీరు ఏం మాట్లాడడం లేదు.. ఇంట్లో మీ పెత్తనం నడిచేది.. ఇప్పుడు దానిది నడుస్తుందా అని రేఖని ఐశ్వర్య అడుగుతుంది. ఇప్పుడు రేఖ పిన్ని వెళ్ళాలన్న ఇందు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలని రాజు అంటాడు. ఆ తర్వాత ఐశ్వర్య దగ్గరున్న కార్ కీస్ ఇందు లాక్కొని ఇకనుంచి నీకు కార్ వద్దని చెప్తుంది. ఏంటి ఆంటీ మీరు సైలెంట్ గా ఉన్నారని ఐశ్వర్య అడుగుతుంది కానీ రేఖ సైలెంట్ గా ఉంటుంది.

ఆ తర్వాత ఏంటి రేఖ నువ్వు దానికి భయపడుతున్నావా అని రేఖని భ్రమరాంబ అడుగుతుంది. ఎందుకు ఆ రాజు చెప్పినట్లు చేస్తుంది.. ఆ రాజు ఏమైనా అంటున్నాడా అని శేషు అంటాడు. మీరు సైలెంట్ గా ఉండండి నా ప్లాన్ నాకు ఉందని రేఖ అనగానే అదేంటో మాక్కుడా చెప్పమని భూషణ్ అనగానే అవసరం లేదని చెప్పి రేఖ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఐశ్వర్య బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుంటే అక్కడ అవ్వదు.. అప్పుడే లక్కీ నేను డ్రాప్ చేస్తానని అంటాడు. అవసరం లేదని ఐశ్వర్య అనగానే సరే నేను బయటకు వెళ్తున్నాను నాకు భయంగా ఉంది వస్తావా అని లక్కీ అడుగుతాడు. సరే నేను పార్టీకి వెళ్తున్నాను.. నువ్వు కూడా నాతో రా అని లక్కీ బైక్ ఎక్కి ఐశ్వర్య వెళ్తుంది. లక్కీ మాత్రం ఫూల్ హ్యాపీగా ఉంటాడు. ఎలాగైనా ఐశ్వర్యని ఇంప్రెస్ చేసి నా ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటాడు. తరువాయి భాగంలో ఐశ్వర్య ఫూల్ గా డ్రింక్ చేసి వచ్చి అసలు ఈ ఇందు రాజు భార్యాభర్తలు కాదని చెప్తుంటే ఎవరు నమ్మట్లేదని అంటుంది. ఒకవేళ ఐశ్వర్య చెప్పేది నిజమే కావచ్చని భ్రమరాంబ, శేషు అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.